
దుర్గమ్మకు ప్రత్యేక పూజలు
● భవానీ మాలధారులతో కిక్కిరిసిన ఆలయం
● భక్తిశ్రద్ధలతో దుర్గమ్మ సారే ఊరేగింపు
సీలేరు: దుర్గమ్మ తల్లి శరన్ననరాత్రుల్లో భాగంగా వాడవాడలా భకిశ్రద్ధలతో పూజలు జరుగుతున్నాయి. మహాలక్ష్మీ దేవి అలంకరణతో అమ్మవారికి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధారకొండ దారాలమ్మ ఆలయంలో శనివారం పెద్ద ఎత్తున భవానీ మాలధారులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ధారకొండ గ్రామంలో మహిళలు అమ్మవారి సారె ఊరేగించి అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మండపంలో కుంకుమ పూజలను అర్చకుడు రామశర్మ నిర్వహించారు. సీలేరులో అమ్మవారికి లక్ష్మీ పూజను దామోదరం నిర్వహించారు. శివాలయం మారెమ్మ తల్లి, వనదుర్గ, ఆలయాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి.
చింతపల్లి: శవన్నవరాత్రులు సందర్భంగా శనివారం శ్రీ లలిత త్రిపుర సుందరీదేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. మండల కేంద్రం హైస్కూల్ జంక్షన్‌లో ఏర్పాటు చేసిన దుర్గమ్మను జెడ్పీటీసీ సభ్యుడు పోతురాజు బాలయ్య పడాల్ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజాము నుంచి చింతపల్లి కేంద్రంలో ఆనాదీశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు.

దుర్గమ్మకు ప్రత్యేక పూజలు

దుర్గమ్మకు ప్రత్యేక పూజలు