
మెడికల్ కాలేజీలప్రైవేటీకరణ తగదు
డుంబ్రిగుడ: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తే సహించేది లేదని అల్లూరి జిల్లా వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మురళీమోహన్ పట్నాయి అన్నారు. అరకులో ఆయన మాట్లాడుతూ పేద గిరిజన విద్యార్థుల ఉన్నత ప్రగతికి మెడికల్ కళాశాలను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా పాడేరులో ఏర్పాటు చేశారన్నారు. ప్రైవేటీకరణకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు సాగించడం సరికాదన్నారు.
మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు కూటమి ప్రభుత్వం పూనుకుంటే న్యాయ, ప్రజాపోరాటం సాగిస్తామన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వరనాయుడు, ఎంపీ తనూజరాణి, ఎమ్మెల్యే మత్స్యలింగంతో కలిసి సంయుక్త పోరాటానికి సిద్ధంగా ఉన్నామన్నారు.