తాగునీరు సురక్షితమే
● ఆర్‌డబ్ల్యూఎస్ జేఈ సాయి
కొయ్యూరు: మండలంలోని రాజేంద్రపాలెం గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలలో తాగునీరు సురక్షితమేనని నిర్థారణ అయింది. ఈ విద్యాలయంలో సుమారు 50 మంది విద్యార్థినులు అనారోగ్యానికి గురవడం తెలిసిందే. తాగునీటి కాలుష్యమే కారణమని అందరూ భావించారు. ఈ మేరకు ట్యాంక్ నుంచి వస్తున్న నీరు, కుళాయి నీరు, వంట గదిలో నీటిని మూడు శాంపిళ్లుగా సేకరించి పరీక్షలకు పంపించారు. వీటికి సంబంధించి ఫలితాల్లో ఎలాంటి హానికర బ్యాక్టీరియా లేనట్టుగా ఫలితాలు వచ్చినట్టు ఆర్‌డబ్ల్యూఎస్ జేఈ సాయి తెలిపారు. దీనిపై ఏటీడబ్ల్యూవోకు నివేదించామని ఆయన వివరించారు. 31 మంది నుంచి సేకరించిన మలం శాంపిళ్లను పాడేరు జీజీహెచ్‌లో పరీక్షించగా ఎలాంటి ప్రమాదం లేదని ఫలితాలు వచ్చాయని ఏటీడబ్ల్యూవో క్రాంతికుమార్ పేర్కొన్నారు.


