అప్పన్నకు వైభవంగా నిత్యకల్యాణం
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి శుక్రవారం ఉదయం 9.30 నుంచి నిత్యకల్యాణం వైభవంగా జరిగింది. ఆలయ కల్యాణమండపంలో వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేశారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణాన్ని నిర్వహించారు. ఉభయదాతలకు స్వామివారి అక్షింతలు, ప్రసాదం, శేషవస్త్రాలను అందించారు.
అమ్మవార్లకు విశేషంగా తిరువీధి
సింహగిరిపై కొలువైన సింహవల్లీ తాయారు, చతుర్భుజ తాయారు అమ్మవార్లకు తిరువీధి ఘనంగా జరిగింది. అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకిలో వేంజేపచేసి సాయంత్రం ఆలయ బేడా మండపంలో తిరువీధిని వేడుకగా నిర్వహించారు. షోడషోపచార పూజలు జరిపారు. భక్తులు అమ్మవార్లను దర్శించుకుని ఆశీస్సులు పొందారు.


