ఇండస్ట్రియల్ కారిడార్‌కు నాలుగు లైన్ల రోడ్డు
● నాలుగు కిలోమీటర్ల మేర నిర్మాణం ● ఆర్ అండ్ బీ, ఏపీఐఐసీ అధికారులతో ఆర్డీవో సమావేశం ● భూసేకరణ, పరిహారం చెల్లింపులపై చర్చ
నక్కపల్లి: రాజయ్యపేట, చందనాడ సమీపంలో నిర్మిస్తున్న విశాఖ చైన్నె ఇండస్ట్రియల్ పార్క్ కోసం 150 అడుగుల వెడల్పుగల నాలుగు లైన్ల రోడ్డు నిర్మించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి నర్సీపట్నం ఆర్డీవో వి.వి.రమణ మంగళవారం నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ అండ్ బీ, రెవెన్యూ, ఏపీఐఐసీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణంలో భాగంగా ఏపీఐఐసీ వా రు సేకరించిన భూముల్లో ఇప్పటికే బల్క్‌డ్రగ్ పా ర్క్ పనులు ప్రారంభమైన విషయం తెలిసిందే. బ ల్క్‌డ్రగ్ పార్క్, ఇతర పరిశ్రమలు స్థాపించే ప్రాంతానికి కనెక్టవిటీ రోడ్డు నిర్మించాల్సి ఉంది. జాతీయ ర హదారిపై కాగిత నుంచి వేంపాడు, అమలాపురం, పాటిమీద, తమ్మయ్యపేట, మీదుగా నాలుగు లైన్ల రోడ్డు (150 అడుగులు) నిర్మించేందుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. సుమారు నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మిస్తారు. రూ.28 కోట్లు మంజూరు చేసి టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. ఈ రోడ్డు నిర్మాణానికి అవసరమైన సుమారు 40 ఎకరాలను గుర్తించారు. నష్టపరిహారం చెల్లింపుల ప్రక్రియ జరుగుతోంది. ఇప్పటికే రూ.8 కోట్ల వరకు పరిహారం చెల్లింపులు జరిగాయని అధికారులు ఆర్డీవోకు వివరించారు. జిరాయితీతోపాటు డీ ఫారం, రైతులు సాగు చేస్తున్న ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయని, వీరందరికీ నష్టపరిహారం చెల్లింపుల ప్రక్రియ పూర్తి చేస్తామని ఏపీఐఐసీ అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తి చేసి త్వరలో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఆర్ అండ్ బీ ఎస్‌ఈ జాన్ సుధాకర్, ఈఈ రమేష్, డీఈ రాధాకృష్ణ, ఏఈ జ్ఞానేశ్వరరావు, వర్క్ ఇన్‌స్పెక్టర్ రాజు, డీటీలు నారాయణరావు, తదితరులు పాల్గొన్నారు.


