నెలకు వారం రోజులు అంతరాయం
● యలమంచిలిలో కాలం చెల్లిన నీటి పథకం
యలమంచిలికి ఎస్.రాయవరం మండలం సోమి దేవిపల్లి (వరాహనది) వద్ద నిర్మించిన సమగ్రనీటి రక్షిత పథకమే ఆధారం. 23 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన పథకం కావడంతో తరుచూ మరమ్మతుల కు గురవుతోంది. నెలలో వారం రోజులపాటు నీ టి సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. తులసీనగర్‌లో తాగునీటి కొరత మరీ ఎక్కుగా ఉంది. ఇక్కడ రెండు రోజులకొకసారి నీటి సరఫరా జరుగుతోంది. టిడ్కో గృహసముదాయం, నెహ్రూనగర్, షేసుకొండకాలనీ, రామచంద్రమ్మ గుడి ప్రాంతాలకు నీటి సరఫరాలో తరుచూ విఘాతం ఏర్పడుతుంది. వైఎస్సార్‌సీపీ హయాంలో రూ.101 కోట్లతో ప్రారంభించిన నీటి సరఫరా పథకం పనులను కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పనులు నిలిచిపోయాయి.


