గత ఏడాది ఏప్రిల్‌లో అందించిన పింఛన్లు 2,66,208 | - | Sakshi
Sakshi News home page

గత ఏడాది ఏప్రిల్‌లో అందించిన పింఛన్లు 2,66,208

Apr 2 2025 2:10 AM | Updated on Apr 2 2025 2:24 AM

గత ఏడాది ఏప్రిల్‌లో అందించిన పింఛన్లు 2,66,208

గత ఏడాది ఏప్రిల్‌లో అందించిన పింఛన్లు 2,66,208

ఈనెల పింఛన్లు అందుకోనున్న లబ్ధిదారులు 2,56,072

వితంతువులకు

చేయూత

చీడికాడ: భర్త మృతి చెంది ఏడాది గడుస్తున్నా ప్రభుత్వం నేటి వరకు పట్టించుకోకపోవడంతో వరాహపురం సర్పంచ్‌ గొల్లవిల్లి చిన్నమ్మలు, వైస్‌ ఎంపీపీ ధర్మిశెట్టి స్వాతి వారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. గ్రామానికి చెందిన ఏడుగురికి తమ గౌరవ వేతనం నుంచి నెలకు వెయ్యి రూపాయలు అందిస్తున్నారు. గ్రామానికి చెందిన మిస్కా శ్యామల, శెట్టి నాగరాజమ్మ, ధర్మిశెట్టి రమణమ్మ, బలిజి దేముళ్లమ్మ, యలమంచిలి అప్పలకొండ, మిస్కా దేముడమ్మ, బాలిబోయిన చిన్నమ్మలు భర్తలు ఈ ఏడాది కాలంలో మృతి చెందడంతో వారు వితంతు పింఛన్ల కోసం సచివాలయాల్లో దరఖాస్తు చేసుకున్నారు. నేటికీ వారికి పింఛన్లు మంజూరు చెయ్యకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరికి పింఛన్లు మంజూరు చెయ్యాలని మూడు మాసాల క్రితం ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో అర్జీలు అందించినట్లు వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు గొల్లవిల్లి రాజుబాబు తెలిపారు. ఏడాది కాలంగా ఎన్నిసార్లు దరఖాస్తులు చేసుకున్నా పింఛన్లు మంజూరు కాలేదన్నారు. దీంతో ఈ నెల నుంచి తమ గౌరవ వేతనం నుంచి ఏడుగురు వితంతువులకు ప్రతి నెలా రూ.1000 చొప్పున అందించేందుకు ఇద్దరు ప్రజా ప్రతినిధులు ముందుకు వచ్చారని చెప్పారు. ఈ నెల నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నారని, తమ పదవీ కాలం ఉన్నంత వరకు అందిస్తామని హామీ ఇచ్చారన్నారు. ప్రభుత్వం వీరికి పింఛన్లు వెంటనే మంజూరు చెయ్యాలని డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ నేత ధర్మిశెట్టి కొండబాబు, స్కూల్‌ కమిటీ చైర్మన్‌ మిస్కా అప్పారావు, మాజీ ఎంపీటీసీ అప్పలనాయుడు, వైఎస్సార్‌సీపీ నేతలు అచ్చిబాబు, యలమంచిలి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

మరి ఇప్పుడో.. ఒకటో తేదీ వచ్చిందంటే గుండెల్లో గుబులు.. ఈనెల పెన్షన్‌ వస్తుందో, ఆగిపోతుందోనన్న బెంగ.. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చాక 10 నెలల్లో ఏకంగా 10,136 పింఛన్లకు కోత విధించారు.

మరణించినవారినేతొలగించామని అధికారులు చెబుతున్నారు. నిజంగా అంతమంది మరణించారా..? వాస్తవం ఏమిటో వారికే తెలియాలి.

కోడి కూయకముందే.. అవ్వా తాతలు మంచం మీద నుంచి కాళ్లు కింద పెట్టక ముందే వలంటీర్‌ నేరుగా ఇంటికే వెళ్లి పింఛను చేతికిచ్చేవాడు.. ఇది ఏడాది క్రితం నాటి మాట.

వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులే టార్గెట్‌గా ఏరివేత

కూటమిప్రభుత్వంలో కొత్త పింఛన్లు

ఉత్త మాటే

కుంటి సాకులతో పెన్షన్లను తొలగిస్తున్న వైనం

మళ్లీ ధ్రువపత్రాలు తెచ్చుకోవాలని దివ్యాంగులకు వేధింపులు

సాక్షి, అనకాపల్లి: ఒకటో తేదీ వచ్చిందన్న సంతోషం పింఛనుదారుల ముఖాల్లో కనిపించడం లేదు సరికదా.. ఉన్న పింఛను పోతుందేమోనని భయం వారి మదిలో మెదులుతోంది. కూటమి నేతలు తమపై కోపంతో ఎక్కడ పింఛను తొలగిస్తారో.. అనే బెంగ వారిని వెంటాడుతోంది. ఈనెల పెన్షన్‌ తీసుకున్న సామాజిక పింఛనుదార్లకు వచ్చే నెల అందుకుంటామో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఒకవేళ పింఛను వస్తే డబ్బుల కోసం ఎక్కడికి రమ్మంటారో.. అంత దూరం ఎలా వెళ్లాలనే బెంగ వారిని వేధిస్తోంది. కానుకగా ఇంటి దగ్గర డబ్బులందుకున్న రోజుల పోయి... కాసుల కోసం వీధి చివర కాపాలా కాసే రోజులు వచ్చాయి. పింఛను ఇంటికే ఇస్తామని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు.. గద్దెనెక్కిన తర్వాత నెల నుంచే లబ్ధిదారులకు చుక్కలు చూపిస్తున్నారు. చెప్పిన చోటికి వస్తేనే పింఛనిస్తామంటూ పంపిణీ చేస్తున్న సిబ్బంది హుకుం జారీ చేస్తున్నారు. చివరికి పింఛనుకు కత్తెర పడే రోజులు కూడా బాబు జమానాలో వచ్చేసిందంటూ అవ్వాతాతలు వాపోతున్నారు. నాటి జన్మభూమి కమిటీలను వారు గుర్తు చేసుకుంటున్నారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులే టార్గెట్‌గా ఏరివేత సాగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

తొలి నెల నుంచి పింఛను వంచన

అధికారంలోకి వచ్చిన తొలి నెల నుంచే పింఛను వంచన మొదలైంది. అది అలా కొనసాగుతూనే ఉంది. గతంలో 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబునాయుడు అవ్వా తాతల విషయంలో ఎలా దుర్మార్గంగా వ్యవహరించారో.. ఇప్పుడూ అదే తీరు కనబరుస్తున్నారు. గత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఒకటో తేదీ ఉదయాన్నే వలంటీర్లు తలుపు తట్టి మరీ.. ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఐదేళ్ల పాటు అవ్వా తాతలు.. దివ్యాంగులు, వ్యాధిగ్రస్తులు.. ఇలా ప్రతి ఒక్క లబ్ధిదారుడికీ ఎలాంటి కష్టం రాకుండా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కంటికి రెప్పలా కాపాడుకుంటూ పింఛను అందజేసింది. కానీ కూటమి అధికారంలోకి వచ్చాక 10 నెలల్లో. పింఛనుదారుల కష్టాలు పెరుగుతున్నాయే తప్ప.. తగ్గడం లేదు. దివ్యాంగుల నుంచి.. పండుటాకుల వరకూ.. పింఛను పొందేందుకు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే 10,136 పింఛన్లకు కోత పడింది. గత చంద్రబాబు ప్రభుత్వంలో (2014–19) జన్మభూమి కమిటీల పెత్తనంతో ఉన్న పెన్షన్లకు ఎలా మంగళం పాడారో.. ఈసారి కూడా అలాగే వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో గత ఏప్రిల్‌ నెలలో అనకాపల్లి జిల్లాలో 2,66,208 మందికి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ ఏప్రిల్‌ నెలలో 2,56,072 మందికి పెన్షన్లు అందజేస్తున్నారు. అంటే కూటమి ప్రభుత్వం వచ్చాక 10 నెలల్లో 10,136 మంది పింఛన్లకు కోత విధించినట్లు అధికార గణాంకాలే తెలియజేస్తున్నాయి.

వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధుల ఆదర్శం

ప్రతి నెలా వెయ్యి రూపాయల సాయం

కొత్తపింఛన్లు కలే..

వైఎస్సార్‌సీపీ హయాంలో ఏడాదికి రెండుసార్లు కొత్త పింఛన్లు ఇచ్చేవారు. ప్రతీ ఏటా జనవరి, జూలై నెలలో అర్హులైన వారందరికీ కొత్త పింఛన్లను అందించడం జరిగింది. రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా లబ్ధిదారులను ఎంపిక చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే చాలు.. వలంటీర్లు ఇంటి వద్దకే వెళ్లి మంజూరు పత్రం అందజేసిన పరిస్థితులు ఉండేవి. కానీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక 10 నెలల్లో కొత్త పింఛన్లు ఇవ్వలేదు సరికదా.. ఉన్న పింఛన్లనే తొలగిస్తున్న పరిస్థితులున్నాయి.

పింఛన్ల కోత లేదు..

ప్రతి నెలలో మరణించినవారి పింఛన్లను మాత్రమే తొలగిస్తున్నాం. అంతే తప్ప కొత్తగా కోత విధించలేదు. భర్త చనిపోతే ఆయన పేరు మీద ఉన్న పింఛన్‌.. భార్య పేరు మీదకు మారుస్తున్నాం. అలా 630 మందిని చేర్చాం.

– శచీదేవి, డీఆర్‌డీఏ పీడీ, అనకాపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement