హాకీ చీఫ్ సెలక్టర్‌గా రమేష్
యలమంచిలి రూరల్: పట్టణానికి చెందిన సీనియర్ హాకీ క్రీడాకారుడు శెట్టి రమేష్ రాష్ట్ర మెన్స్ జూనియర్ హాకీ పోటీలకు చీఫ్ సెలక్టర్‌గా నియమితులయ్యారు. ఈ నెల 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు అనంతపురం జిల్లా ధర్మవరంలో జరిగే హాకీ పోటీలకు శెట్టి రమేష్ చీఫ్ సెలక్టర్‌గా వ్యవహరించనున్నారు. యలమంచిలికి చెందిన రమేష్ గతంలో వరుసగా ఎనిమిదిసార్లు జాతీయ హాకీ పోటీల్లో రాష్ట్ర జట్టు తరపున ప్రాతినిథ్యం వహించారు. అనుభవం కలిగిన రమేష్‌ను రాష్ట్ర మెన్స్ జూనియర్ హాకీ పోటీలకు చీఫ్ సెలక్టర్‌గా నియమిస్తూ హాకీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ నిరంజన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారని అనకాపల్లి జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శి కొఠారు నరేష్ శుక్రవారం రాత్రి మీడియాకు తెలిపారు. యలమంచిలికి చెందిన క్రీడాకారుడికి తొలిసారిగా చీఫ్ సెలక్టర్‌గా వ్యవహరించే గౌరవం లభించడం పట్ల సీనియర్ క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


