దేవరాపల్లిలో భారీ వర్షం
దేవరాపల్లి: దేవరాపల్లి మండల వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి భానుడి ప్రతాపంతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలకు సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులుతో కూడిన భారీ వర్షం పడడంతో ఉపశమనం పొందారు. భారీ వర్షంతో ప్రధాన రోడ్డు వర్షపు నీటితో నిండిపోయింది. దేవరాపల్లిలోని శ్రీకృష్ణాలయం పక్కన ఉన్న గ్రామ సచివాలయం–2 వద్ద అగ్రహారపు మంగరాజు ఇంటిలోకి డ్రైనేజీల్లో నుంచి నీరు ప్రవేశించింది. ఇంట్లో సరుకులు, తిండి గింజలు, ఇతర సామగ్రి తడిసి ముద్దయ్యాయని బాధితుడి ఆవేదన వ్యక్తం చేశారు.


