350 లీటర్ల బెల్లం పులుపు ధ్వంసం
స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ ఫైనల్ జాబితా విడుదల
పాయకరావుపేట: పట్టణం పరిధిలో పలు సారా తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. సారా తయారీకి ఉపయోగించే 350 లీటర్ల బెల్లం పులుపును ధ్వంసం చేసినట్లు ఎకై ్సజ్ సీఐ జి.శ్రీనివాసరావు తెలిపారు. నవోదయం 2.0లో భాగంగా జరిగిన దాడుల్లో పట్టణంలోని అంబేడ్కర్ కాలనీ, దుర్గా కాలనీని చెందిన ఇద్దరు వ్యక్తులను సారా తయారీ కేసులో అరెస్ట్ చేశామన్నారు. వారి వద్ద నుంచి 15 కేజీల నల్ల బెల్లం, 3 కేజీల అమ్మోనియంను స్వాధీనం చేసుకున్నట్టు సీఐ తెలిపారు. నిందితులను యలమంచిలి కోర్టుకు తరలించామన్నారు.


