మాకవరపాలెం ఎంపీపీగా సర్వేశ్వరరావు బాధ్యతల స్వీకారం
మాకవరపాలెం: ఎంపీపీగా రుత్తల సర్వేశ్వరరావు బాధ్యతలు శుక్రవారం స్వీకరించారు. ఎంపీపీ సత్యనారాయణ రాజీనామా చేయడంతో గత నెల 27న ఎంపీపీ ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికలో సభ్యులు సర్వేశ్వరరావును ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో సర్వేశ్వరరావు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేష్, పార్టీ సీనియర్ నాయకులు రుత్తల యర్రాపాత్రుడుతోపాటు వైఎస్సార్‌సీపీ నాయకులు.. సర్వేశ్వరరావుకు అభినందనలు తెలిపారు. మండల ప్రత్యేక అధికారి రామ్మోహన్‌రావు, ఎంపీడీవో సీతామహాలక్ష్మి, మండల పరిషత్ సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు చిటికెల రమణ, మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్, నియోజకవర్గ పంచాయతీరాజ్ అధ్యక్షుడు బొడ్డు గోవిందరావు, వైస్ ఎంపీపీ రాజారావు, పెట్ల భద్రాచలం, వివిధ గ్రామాల ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.


