ఇంటి పునాదుల ధ్వంసంపై ఫిర్యాదు
రోలుగుంట : భోగాపురం గ్రామంలో కాలనీ దగ్గర ప్రభుత్వం ఇచ్చిన భూమిలో లబ్ధిదారుడు పరవాడ దొరబాబు ఇంటి నిర్మాణం చేపట్టాడు. దీనిని సమీపంలో గల కొందరు దౌర్జన్యం చేసి ఇంటి నిర్మాణం చేయకుండా పునాదులు తవ్వి ధ్వంసం చేశారు. అంతే కాకుండా తనపై దాడికి దిగుతున్నారని, తనకు వారి నుంచి రక్షణ కల్పించాలని బాధితుడు దొరబాబు జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్‌కు ఫిర్యాదు చేశారు. వివరాలివి. రోలుగుంట మండలం కంచుగుమల పంచాయతీ శివారు భోగాపురం గ్రామంలో దివంగత తహసీల్దార్ పెంటకోట అప్పలనాయుడు సర్వే నెనంబరు 13/సి ప్లాట్ నెంబరు 37లో ఇంటి స్థలాన్ని 2015లో ఇచ్చారు. ఈ స్థలంలో దొరబాబు గృహనిర్మాణం చేపట్టగా సమీపంలో ఉన్న నక్కా రాజు, అప్పారావు, వెంకటరమణ దౌర్జన్యంగా వచ్చి నిర్మాణాన్ని అపేయాలని పునాదులు తవ్వి ధ్వంసం చేశారు. ఈ స్థలం నీది కాదని, తప్పుడు పేర్లతో 20 ఏళ్ల క్రితం పాత పట్టాని చూపి బెదిరిస్తున్నారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు.


