బాలుడి కోసం డోలీ మోత
బాలుడిని కొండ శిఖరాగ్రం నీలిబంద నుంచి వైద్యం కోసం డోలీలో తరలిస్తున్న కుటుంబ సభ్యులు
రోలుగుంట: అర్ల గిరిజన పంచాయతీ శివారులో కొండ శిఖరాగ్రాన ఉన్న నీలిబంద, పీత్రుగడ్డ, తదితర గ్రామాల ప్రజలు ఇప్పటికీ డోలీలనే ఆశ్రయిస్తున్నారు. అనారోగ్యంతో బాధ పడుతున్న నీలిబందకు చెందిన గెమ్మిలి సింహాద్రి (9)ని అతని తల్లిదండ్రులు శనివారం డోలిలో రావికమతం మండలం కుంజుర్తి గ్రామం వరకు ఆరు కిలోమీటర్లు మోసుకొచ్చి అక్కడ నుంచి ఆటోలో తరలించి ఆస్పత్రిలో చేర్చారు. కొయ్యూరు మండలం చిట్టింపాడు ట్రైబల్ వేల్ఫేర్ స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్న సింహాద్రి చేతులు, కాళ్లపై కురుపులతో ఇంటికి వచ్చాడు. తరువాత జ్వరం కూడా రావడంతో నడవలేని స్థితిలో ఉన్న ఆ బాలుడిని అతని తండ్రి, తాతయ్య శనివారం డోలిలో వైద్యం కోసం తరలించారు.


