నాటి లేటరైట్ మాటలు నేడు ఏమయ్యాయి?
● దోపిడీ వెనుక స్పీకర్ హస్తం ఉందో లేదో స్పష్టం చేయాలి ● ఆరోపించిన మాజీ ఎమ్మెల్యే గణేష్
నర్సీపట్నం : లేటరైట్ దోపిడీ వెనుక స్పీకర్ సిహెచ్.అయ్యన్నపాత్రుడు హస్తం ఉందో లేదో ప్రజలకు స్పష్టత ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నాతవరం మండలం, సుందరకోటలో రూ.వేల కోట్ల ఖనిజ సంపదను దోచుకునేందుకు కూటమి ప్రభుత్వం దారులు తెరిచిందన్నారు. లేటరైట్ ముసుగులో బాకై ్సట్‌ను తవ్వుకు పోతున్నారన్నారు. 2022లో టీడీపీ నాయకులతో కలిసి ఆ ప్రాంతంలో ఆందోళన చేపట్టి, లేటరైట్ ముసుగులో బాకై ్సట్ పట్టుకుపోతున్నారని గగ్గోలు పెట్టిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇప్పుడు ఎందుకు నోరుమెదపడం లేదని ఆయన ప్రశ్నించారు. స్పీకర్ ప్రమేయంతోనే లేటరైట్ దోపిడీ జరుగుతుందనే అనుమానం ప్రజల్లో వ్యక్తమవుతుందన్నారు. దీనిపై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉందన్నారు. ఖనిజ సంపదను దోచుకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై కూటమి నేతలకు చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. నర్సీపట్నంకు చెందిన ఓ ప్రముఖ హోటల్ యజమాని లేటరైట్ తవ్వకాలు జరిపించడంలో కీలకపాత్ర వహిస్తున్నారని ఆరోపించారు. హోటల్ యజమాని రాజమండ్రిలోని ఓ కంపెనీతో రూ.వందల కోట్లు బేరం కుదుర్చుకున్నారన్నారు. హోటల్ యజమాని సుందరకోట పెద్దలను పిలిపించి మాట్లాడడం జరిగిందన్నారు. హోటల్ యజమాని స్వయంగా లేటరైట్ ప్రాంతానికి వెళ్లి లేటరైట్‌కు అనుకూలంగా లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తోందని కొందరని హెచ్చరించడం జరిగిందన్నారు. లేటరైట్ దోపిడీలో కీలకపాత్ర వహిస్తున్న హోటల్ యజమానికి స్పీకర్ అండదండలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని మాజీ ఎమ్మెల్యే గణేష్ ఆరోపించారు. ఆ ప్రాంత గిరిజనులకు ఎలాంటి నష్టం జరిగినా సహించబోమని, వైఎస్సార్‌సీపీ వారికి అండగా ఉంటుందని గణేష్ తెలిపారు.


