అనకాపల్లి : విద్యుత్ ఉద్యోగుల జిల్లా ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ అధ్యక్షుడిగా ఓ.శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో బుధవారం జరిగిన ఎన్నికల్లో జిల్లా ప్రధాన కార్యదర్శిగా పి.చంద్రశేఖర్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వై.రాజయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా బి.వరహాలు, కోశాధికారిగా పి.ఎస్.ఎన్.మూర్తి, ఉపాధ్యక్షులుగా సిహెచ్.లోవరాజు, జె.అశోక్ రాజీవ్, సిహెచ్.మధు, ఎం.రాజుపెంటయ్య, ఎస్.ఈశ్వరరావు, సహాయ కార్యదర్శులుగా కె.దేముడు, ఎల్.రామకృష్ణ, పి.చంద్రరావు, జి.ఎస్.ప్రకాష్, డి.రామకృష్ణ, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్‌గా మరో పది మంది ఎంపికయ్యారు. ఈ ఎన్నికకు ఏపీఈపీడీసీఎల్(డిస్కం) అధ్యక్ష, కార్యదర్శులు సిహెచ్.సాయిబాబు, ఎం.నిర్మలమూర్తి పరిశీలకులుగా వ్యవహరించారు. ఈ కమిటీ రెండేళ్ల పాటు కొనసాగుతుందని అసోసియేషన్ అధ్యక్షుడు తెలిపారు.


