రాష్ట్ర స్థాయి బేస్‌బాల్ పోటీల్లో సత్తా
విద్యార్థులను అభినందిస్తున్న
ఏఎంసీ చైర్మన్ జి.వి.రమణ
నర్సీపట్నం: ఇటీవల నంద్యాలలో జరిగిన రాష్ట్ర స్థాయి బేస్‌బాల్ పోటీల్లో బలిఘట్టం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు తృతీయ బహుమతి సాధించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను, వీరికి తర్పీదు ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయుడు ఎస్.నాగేశ్వరరావును ఏఎంసీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, హెచ్‌ఎం కె.శ్రీదేవి, ఉపాధ్యాయులు మంగళవారం ఇక్కడ పాఠశాలలో అభినందించారు. చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని చైర్మన్ విద్యార్థులకు సూచించారు.


