కొలువుల్లో రాణింపు
నా పేరు జెర్రిపోతుల నూకరాజు, మాది అనకాపల్లి మండలం వెంకటరమణపేట. పోలియోతో నా కుడికాలి పాదం చచ్చుబడిపోయింది. బంధువుల సహాయంతో అచ్యుతాపురం ఇంటిగ్రేటెడ్ ఆశ్రమ పాఠశాలలో చేరాను. ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకూ పట్నాయక్ మాస్టార్ పర్యవేక్షణలో చదువుకున్నాను. ప్రస్తుతం దువ్వాడలో ఫిన్‌సోల్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాను.
నేను తాడి నాగమణి, 6వ తరగతిలో ఇంటిగ్రేటెడ్ ఆశ్రమ పాఠశాలలో చేరి టీటీసీ పూర్తి చేసుకున్నాను. పట్నాయక్ మాస్టార్ సహకారంతో అంధురాలైనప్పటికీ నాకు వెన్నుదన్నుగా నిలిచి ప్రోత్సహించడంతో ప్రస్తుతం శ్రీహరిపురం వద్ద గొల్లలపాలెం ప్రభుత్వ ఎలిమెంటరీ పాఠశాలలో ఉపాధ్యాయినిగా విధులు నిర్వహిస్తున్నాను.
కొలువుల్లో రాణింపు


