షార్ట్ సర్క్యూట్‌తో బేకరీ షాపు దగ్ధం
షాపులో నుంచి వ్యాపించిన దట్టమైన పొగ
నర్సీపట్నం: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో పట్టణంలోని శారదనగర్‌లోని బేకరి షాపు మంగళవారం తెల్లవారుజామున దగ్ధమైంది. షాపులో నుండి దట్టమైన పొగలు ఒక్కసారిగా వ్యాపించాయి. సమాచారం అందడంతో సమీపంలో నివాసం ఉంటున్న షాపు యజమాని ఆర్.పాత్రుడు ఘటన స్థలానికి చేరుకున్నాడు. వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించడంతో సకాలంలో ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మంటలు అదుపులోకి రావడంతో పక్క షాపులకు ముప్పు తప్పింది. షాపులోని లక్షల విలువ చేసే కేక్‌లు, వివిధ రకాల పుడ్స్, తయారు చేసే మిషనరీ దగ్ధమైంది. విషయం తెలుసుకున్న డీఎస్పీ శ్రీనివాసరావు, ఎస్‌ఐలు రమేష్, ఉమామహేశ్వరరావు పరిస్థితిని సమీక్షించారు.


