గ్యాస్ కొరత లేకుండా ప్రభుత్వం, అధికారులు దృష్టి సారించాలి. కొంతమంది డీలర్స్ గ్యాస్ కొరతను చూపిస్తున్నట్టు వినియోగదారులు చెబుతున్నారు. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో రహదారులపై చిన్నచిన్న దుకాణాలు గ్యాస్ సమస్యతో మూసివేయడం జరిగింది. ఎప్పటికప్పుడు అధికారులు గ్యాస్ ఏజెన్సీలపై తనిఖీలు నిర్వహించాలి.
–బి.మధు, మార్టూరు గ్రామం, అనకాపల్లి మండలం
15 రోజుల తరువాత గ్యాస్ ఇచ్చారు
గతంలో గ్యాస్ బుక్ చేసుకున్న మరుసటి రోజు గ్యాస్ బోయ్ ఇంటికి తీసుకుని వచ్చి ఇచ్చేవారు. గ్యాస్‌పై 15 రోజుల్లో రూ.60 పెంచారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలంటే తెల్లవారు జామున 5 గంటల నుంచి 7 గంటల్లోపు బుక్ చేసుకున్న వారికి మాత్రమే గ్యాస్ బుక్ అవుతుంది. మిగిలిన సమయంలో సర్వర్ మోరాయిస్తుంది.
–లక్ష్మి, బీఆర్టీ కాలనీ, అనకాపల్లి మండలం
డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్లు పూర్తిస్థాయిలో సరఫరా
ప్రభుత్వ ఆదేశాల మేరకు కమర్షియల్ దుకాణాలకు గ్యాస్ సరఫరా నిలిపివేశాం, గృహాలకు ఉపయోగించే వినియోగదారులకు మాత్రమే సరఫరా చేస్తున్నాం. ప్రజలకు ఇబ్బందులు లేకుండా జిల్లాలో వివిధ మండలాల్లో విధులు నిర్వహిస్తున్న పౌరసరఫరా శాఖ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడైనా గ్యాస్ కొరత ఉన్నట్టు మా దృష్టికి తీసుకువచ్చినట్టయితే పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం.
–కె.వి.ఎల్.ఎన్.మూర్తి, జిల్లా పౌరసరఫరా శాఖ అధికారి


