యలమంచిలి రూరల్: మండలంలోని కృష్ణాపురంలో గురువారం ఓ పూరింట్లో అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో మంటలు వ్యాపించాయి. విద్యుత్ మీటర్, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర గృహోపకరణాలు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే యలమంచిలి అగ్నిమాపక కేంద్రం సిబ్బంది వాహనంతో ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసే ప్రయత్నం చేశారు. ప్రమాదంలో సుమారు లక్ష రూపాయల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్టు యలమంచిలి అగ్ని మాపక కేంద్రం అధికారి రాంబాబు తెలిపారు.


