మాకు ఇద్దరు పిల్లలు సంతానం. చిన్నవాడైన గురువయ్య మూడు నెలల వయస్సులోనే అనారోగ్యం పాలయ్యాడు. చాలా ఆసుపత్రుల చుట్టూ తిరగాం. అయినా నయం కాలేదు. తలసేమియాతో బాధపడుతున్నట్లుగా డాక్టర్లు చెప్పారు. క్రమం తప్పని చికిత్సతో పాటు తరచూ రక్తమార్పిడి చేయిస్తుండాలని చెప్పారు. కూలి పనులతో జీవనం సాగించే మాకు పిల్లాడి చికిత్స తలకు మించిన భారమే అయింది. ఇదే సమయంలో తలసేమియా బాధితుల చికిత్స కోసం సీఎం వైఎస్ జగనన్న రూ.10 వేలు ఆర్థిక సాయం అందించేలా చర్యలు తీసుకుని మా కుమారుడికి పునర్జనిచ్చారు. ప్రస్తుతం తన తోటి పిల్లలతో కలసి మా కుమారుడు కూడా పాఠశాలకు వెళ్లి చదువుకుంటున్నాడు. సీఎం వైఎస్ జగనన్నకు కృతజ్ఞతలు.
– వెంకటప్రతాప్, శిరీషా దంపతులు, పుట్లూరు
మేలు మరువం
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందా. వైఎస్సార్ చేయూత కింద ఏటా రూ.18,750, గృహ నిర్మాణం పథకం కింద జగనన్న కాలనీలో స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించారు. వైఎస్సార్ పెన్సన్ కానుక కింద వితంతు పింఛన్ వస్తుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు బాగున్నాయి. సీఎం జగన్ మేలును మరువం. మద్దతుగా నిలుస్తాం.
– నూర్జహాన్ బేగం, కూడేరు
పింఛన్ ఇచ్చి ఆదుకున్నారు
వ్యవసాయంతో జీవనం సాగిస్తున్న మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏడేళ్లుగా కిడ్ని సంబంధిత వ్యాధితో బాధపడుతున్నా. గత టీడీపీ ప్రభుత్వంలో ఆర్థిక సాయం కోసం, పింఛన్ కోసం పలుమార్లు అధికారులను, ప్రజాప్రతినిధులను ప్రాధేయపడినా ఎవరూ పట్టించుకోలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థతో మా జీవితాలు బాగుపడ్డాయి. వలంటీర్ మా ఇంటి వద్దకే వచ్చి వివరాలు తీసుకెళ్లి నాకు పింఛన్ ఇచ్చేలా చేశారు. ఈ డబ్బుతో మెరుగైన వైద్య చికిత్సలు పొందుతున్నా. నా ప్రాణాలు కాపాడిన సీఎం వైఎస్ జగనన్నకు మా కుటుంబం ఎంతో రుణపడి ఉంటుంది.
– దేవన్న, కలుగోడు, గుమ్మఘట్ట మండలం
జగనన్నే మాకు పెద్ద దిక్కు
జగనన్న సీఎం అయిన తర్వాత మా కష్టాలన్నీ తీరాయి. మేము నలుగురమూ అక్కాచెల్లెళ్లమున్నాం. మా నాన్న అనారోగ్యంతో చనిపోయాడు. మాకు పెద్ద దిక్కు లేకుండా పోయింది. మమ్మల్ని చదివించేందుకు మా అమ్మ చాలా కష్ట పడింది. డ్రాపౌట్‌గా మారే తరుణంలో జగనన్న సీఎం అయ్యారు. అప్పుడే అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన పథకాలతో మేము ఉన్నత చదువులు అభ్యసించేందుకు మార్గం ఏర్పడింది. మా అమ్మకు వైఎస్సార్ చేయూత పథకం కింద ఏటా రూ.18,750 లబ్ధి చేకూరుతోంది. దీంతో కుటుంబంలోని ఆర్థిక ఇబ్బందులు దూరమవుతూ వచ్చాయి. మా అవ్వకు రూ.3వేల పింఛన్ అందుతోంది. కుటుంబ పెద్ద లేకపోయాడని దిగులు పడుతున్న సమయంలో ఇంటికి పెద్ద దిక్కుగా సీఎం వైఎస్ జగనన్న నిలబడడం మాకెంతో ఆనందంగా ఉంది.
– సుమలత, ఫళారం, గుడిబండ మండలం
Comments
Please login to add a commentAdd a comment