భయమేస్తోంది
నా ఇంటికి గతంలో ప్రతి నెలా రూ. 250 నుంచి రూ. 300 వరకు కరెంట్ బిల్లు వచ్చేది. రెండు నెలల క్రితం నుంచి బిల్లు రూ. 600 నుంచి రూ.700 వరకూ పెరిగింది. బిల్లులు చూస్తే భయమే స్తోంది. చిరు వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు భరించడమే కష్టంగా ఉన్న సమయంలో కరెంట్ బిల్లులు ఒక్కసారిగా రెండింతలు చేసి మోయలేని భారం వేశారు. కరెంట్ చార్జీలు పెంచబోమని గతంలో చెప్పి నేడు పెంచడం మోసం చేయడమే అవుతుంది.
– కరీంబాషా, కూడేరు


