జిల్లా అంతటా శనివారం చలి వాతావరణం కొనసాగింది. పగటి ఉష్ణ
రాష్ట్రంలో మహిళలకు
రక్షణ కరువు
● సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ స్పందించాలి
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి
అనంతపురం కార్పొరేషన్: కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. ఈ మేరకు శనివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన అనతి కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు, యువతులు, బాలికలపై అఘాయిత్యాలు అధికమయ్యాయన్నారు. ఇటీవల అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం ప్యారం పల్లికి చెందిన గౌతమి పట్ల టీడీపీ నాయకుని కుమారుడు గణేష్ అమానుషంగా ప్రవర్తించడం దారుణమన్నారు. యాసిడ్ తాగించి, కత్తితో దాడి చేయడం బాధాకరమన్నారు. అధికార మదంతోనే ఇటువంటి దారుణాలకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు జరుగుతుంటే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. శాంతి భద్రతలను కాపాడటంలో ఘోరంగా విఫలమయ్యారన్నారు. దాడి ఘటనపై సీఎం, డిప్యూటీ సీఎంలు స్పందించాలని డిమాండ్ చేశారు. పోలీసు శాఖ మరింత అప్రమత్తం కావాల్సి ఉందన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో తెలంగాణ ప్రాంతంలో యువతిపై అత్యాచారం జరిగితే ఆంధ్రప్రదేశ్‌లో ఏ మహిళకు అటువంటి పరిస్థితి తలెత్తకూడదని అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ‘దిశ’ పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. మహిళలకు రక్షణ కల్పించేందుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పటిష్ట చర్యలు తీసుకున్నారన్నారు. నేడు మహిళలపై దాడులు జరుగుతున్నా కూటమి ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషిస్తోందని దుయ్యబట్టారు. ప్రజలన్నీ గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి తప్పక బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment