ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
ఉరవకొండ: మండల పరిధిలోని లత్తవరం తండా గ్రామానికి చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని కావ్యబాయి (16) ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. లత్తవరం తాండా గ్రామానికి చెందిన ఈశ్వర్‌నాయక్, జానకిబాయి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. పెద్ద కుమార్తె కావ్యబాయి ఉరవకొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం (సీఈసీ) చదువు తోంది. మూడు రోజుల నుంచి కళాశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంది. బుధవారం ఉదయం కూలి పనులకు వెళ్లిన ఈశ్వర్‌నాయక్, జానికిబాయిలు మధ్యాహ్నం ఇంటికి రాగా, కావ్యబాయి ఫ్యాన్‌కు ఉరికి వేలాడుతూ కనిపించింది. వెంటనే కుమార్తెను కిందికి దించి ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. విద్యార్థిని మృతికి దారితీసిన కారణాలు తెలియరాలేదు. ఎస్‌ఐ జనార్దన్‌నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బొప్పాయి చెట్ల నరికివేత
బ్రహ్మసముద్రం: మండలంలోని రాయలప్పదొడ్డి పంచాయతీ యనకల్లు గ్రామ సమీపంలో సర్పంచ్ రామ్మోహన్ సాగు చేసిన బొప్పాయి చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికి వేశారు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. తనకున్న 5 ఎకరాల్లో రామ్మోహన్ బొప్పాయి సాగు చేపట్టారు. గిట్టని వారు తోటలోకి చొరబడి పిందె దశలో ఉన్న 70కి పైగా చెట్లను నరికి వేశారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధిత రైతు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment