అనంతపురం టౌన్: ప్రధాన మంత్రి అవాస్ యోజన (పీఎంఏవై) కింద ఇళ్ల నిర్మాణాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ శైలజ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సొంత స్థలం ఉండి పొజిషన్ సర్టిఫికట్ లేదా ఇంటి డీ పట్టా ఉన్న వారు మార్చి 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం వాటా రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ. లక్షతోపాటు ఎస్సీలకు, వీవర్స్‌కు అదనంగా రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు అందజేయనున్నట్లు తెలిపారు.
చిత్తడి నేలలు పరిరక్షించాలి
అనంతపురం అర్బన్: జిల్లాలో చిత్తడి నెలల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మార్చి 10లోగా జిల్లాలో గుర్తించదగిన 15 చిత్తడి నేలల ప్రాంతాల కోసం నోటిఫికేషన్ ప్రతిపాదనలను సమర్పించాలని చెప్పారు. రెండో దశలో జూన్ 10వ తేదీ నాటికి మరో 100 నోటిఫికేషన్ ప్రతిపాదనలు, మూడో దశలో జూలై 10 నాటికి మిగిలిన వాటికి నోటిఫికేషన్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. డీఎఫ్‌ఓ మాట్లాడుతూ చిత్తడి నెలల ప్రాముఖ్యతను వివరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సేవల్లో జిల్లా వెనుకబడింది..
‘ప్రజలకు సేవలందించడంలో జిల్లా వెనుకబడి ఉంది. ప్రభుత్వ పాధాన్యత అంశాల అమలులో రాష్ట్రంలోనే జిల్లా ఆరో స్థానంలోపే ఉండేలా పనిచేయాలి’ అని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీఎస్‌ఓ, డీఎంహెచ్‌ఓ, ఆర్‌టీసీ, రెవెన్యూ, మునిసిపల్ శాఖ అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి జిల్లా ఆరో స్థానంలోపే ఉండేలా చూడాలన్నారు. ఎకై ్సజ్, అన్నా క్యాంటీన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నిరుపయోగంగా ఉన్న సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కేంద్రాలను వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment