రమేష్‌గౌడ్‌కు ఇంటర్నేషనల్ అవార్డ్
అనంతపురం ఎడ్యుకేషన్: కులమతాలకు అతీతంగా 13 ఏళ్లుగా నిస్వార్థంగా సేవలందిస్తున్న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, టాస్క్‌ఫోర్స్ సభ్యుడు, బీసీ కులాల ఐక్య వేదిక నాయకుడు చిట్లూరు రమేష్‌గౌడ్‌కు ప్రపంచస్థాయి గుర్తింపు లభించింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్’ సంస్థ ప్రతిఏటా ప్రతిష్టాత్మకంగా అందజేసే ‘ఇంటర్నేషనల్ ఎక్స్‌లెన్సీ అవార్డ్స్’ను ఆయన అందుకున్నారు. వివిధ విభాగాల్లో దేశవ్యాప్తంగా దాదాపు 20 మంది ఎంపిక కాగా, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికై న ఏకై క వ్యక్తి రమేష్‌గౌడ్ కావడం విశేషం. ‘నిస్వార్థ సేవలు, ప్రజలను ఎక్కువగా ప్రభావితం’ కేటగిరీ నుంచి అవార్డుకు ఎంపిక చేయడం గమనార్హం. సౌదీ అరేబియా దేశంలోని దుబాయి వేదికగా బుధవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో రమేష్‌గౌడ్ అవార్డు అందుకున్నారు. నిరుపేదల వైద్యానికి, పేద విద్యార్థుల చదువులకు రమేష్‌గౌడ్ అండగా నిలిచారు. కోవిడ్ మహమ్మారి విజృంభించిన సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు దుస్తులు, మందులు, ఆహారం, నిత్యావసర సరుకులు తదితరాలు పంపిణీ చేశారు. తన సేవలతో యువతపై తీవ్ర ప్రభావం చూపుతున్నారని గుర్తించి అవార్డుకు ఎంపిక చేసినట్లు ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్’ సంస్థ వెల్లడించింది. అవార్డు ప్రదానోత్సవంలో కేంద్రమంత్రి రాందాస్ అథవలితో పాటు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సీఈఓ సంతోష్ శుక్లా, దుబాయ్, చైనా, రష్యా, జర్మనీ తదితర దేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రమేష్‌గౌడ్‌కు వైఎస్సార్‌సీపీ నాయకులు, బీసీ కులాల ప్రతినిధులు అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment