రోడ్డున పడేయొద్దు
తమ కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకోవాలని 1962 మొబైల్ అంబులెన్స్ డాక్టర్లు, పారావెట్స్, డ్రైవర్లు వేడుకున్నారు. ఉన్నపళంగా మొదటి విడత అంబులెన్స్‌లు నిలిపివేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ బుధవారం అనంతపురం పశుసంవర్ధక శాఖ జేడీ కార్యాలయంలో జేడీ డాక్టర్ జీపీ వెంకటస్వామిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ముందస్తు సమాచారం లేకుండానే అంబులెన్స్‌లు నిలిపివేయడంతో తమ కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు. తమకు రావాల్సిన బకాయిలు చెల్లించడంతో పాటు సంస్థ మారినా మళ్లీ తమనే విధుల్లోకి తీసుకునేలా చూడాలని కోరారు. జేడీని కలిసిన వారిలో డాక్టర్ శృతి, డాక్టర్ హైమ, డాక్టర్ కరణ్, డాక్టర్ మంజుశ్రీ, సిబ్బంది మహదీప్, ఆకాష్, వినోద్, షరీఫ్, పవన్‌సాయి, కళ్యాణ్‌బాబు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment