రెవెన్యూ సమస్యల్ని పరిష్కరించాలి
అనంతపురం అర్బన్: ‘‘రెవెన్యూశాఖ పరిధిలోని సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఏ ఒక్క అర్జీ పెండింగ్‌లో ఉండడానికి వీలులేదు’’ అని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ రెవెన్యూ డివిజన్, మండలస్థాయి అధికారులను ఆదేశించారు. బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, అసిస్టెంట్ కలెక్టర్ బి.వినూత్న, డీఆర్‌ఓ ఎ.మలోల, ఆర్‌డీఓలు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్‌ఎస్‌డీటీలు, మండల సర్వేయర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సేవలకు సంబంధించి చుక్కల భూములు, మ్యుటేషన్ దరఖాస్తులు, వివాహ, సమీకృత, కుటుంబ సభ్యుల సర్టిఫికెట్లు, మ్యుటేషన్ ఫార్ ట్రాన్సాక్షన్, పాసుపుస్తకం సేవలు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు, దరఖాస్తులు పరిష్కరించాలన్నారు. అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అర్జీలు పరిష్కరించారా.. లేదా?
ఆత్మకూరు: రెవెన్యూ సదస్సుల్లో అందిన అర్జీలను పరిష్కరించారా లేదా అని క్షేత్ర స్థాయిలో కలెక్టర్ వినోద్‌కుమార్ పరిశీలించారు. ఆత్మకూరు మండలంలోని మదిగుబ్బలో బుధవారం ఆయన పర్యటించారు. గ్రామానికి చెందిన జింకల నరసింహులు అనే రైతు తన భూమికి దారి చూపించాలంటూ అందించిన అర్జీపై ఆరా తీశారు. ఇరు వర్గాలతో మాట్లాడారు. ప్లాన్ మార్క్ ప్రకారం రస్తా చూపించాలని ఆర్డీఓ, తహసీల్దార్‌ను ఆదేశించారు. మిగిలిన భూమిలో చట్ట ప్రకారం హక్కులు కల్పిస్తామని స్పష్టం చేశారు. ఎవరూ గొడవలు చేసుకోరాదని హితవు పలికారు.
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment