పామిడి: చెత్తతో సంపద తయారీ కేంద్రాలతో పంచాయతీలకు ఆదాయం సమకూరుతుందని కలెక్టర్ వినోద్‌కుమార్ అన్నారు. శనివారం మండలంలోని వంకరాజుకాలువ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెత్త సేకరణ సక్రమంగా చేపట్టాలన్నారు. ఆదాయంతో పంచాయతీలో అభివృద్ధి పనులు చేపట్టవచ్చన్నారు. కలెక్టర్ వెంట మెప్మా పీడీ విజయలక్ష్మి, ఎంపీడీఓ తేజోత్స్న, ఈఓఆర్డీ కృష్ణకుమార్, డీటీ లక్ష్మీనారాయణరెడ్డి, రీసర్వే డీటీ విజయ్, రెవెన్యూ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు,
కలెక్టర్‌కు సమస్యల ఏకరువు...
వంకరాజుకాలువలో నెలకొన్న సమస్యలను గ్రామస్తులు కలెక్టర్ ఎదుట ఏకరువు పెట్టారు. పెన్నప్పగుడి నుంచి గ్రామానికి ఉన్న తారు రోడ్డు గుంతలమయం కావడంతో ప్రయాణం నరకప్రాయంగా మారిందన్నారు.గ్రామంలోని తాగునీటి ట్యాంకులు శిథిలావస్థకు చేరడంతో నీరు వృథా అవుతోందన్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరారు.
లింగ నిర్ధారణకు పాల్పడితే చర్యలు
అనంతపురం అర్బన్: గర్భస్థ లింగ నిర్ధారణకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ ఆదేశించారు. వంకరాజు కాలువ గ్రామ సచివాలయం నుంచి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్కానింగ్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేయాలన్నారు. కర్ణాటక సరిహద్దు మండలాల్లో చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment