ఉపాధి పనుల్లో భారీగా అక్రమాలు
రాయదుర్గం: కూటమి అధికారంలోకి వచ్చాక ఉపాధి హామీ పనుల్లో భారీగా అవకతవకలు, అక్రమాలు జరిగాయని వైఎస్సార్‌సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి ఆరోపించారు. ఈ పథకం కూలీలకు కాకుండా కూటమిలోని కొందరు కాంట్రాక్టర్లకు వరంగా మారిందన్నారు. సోమవారం రాయదుర్గంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు హాజరైన ఆయన జిల్లాలోని పలు మండలాల ఎంపీపీలు, సర్పంచులతో కలసి కలెక్టర్ వినోద్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం విలేకర్ల సమావేశంలో రవీంద్రారెడ్డి మాట్లాడారు. అధికార పార్టీ చెప్పిన వారికి ఉపాధి పనులను ధారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. కూలీలతో కాకుండా ఉపాధి పనులను కాంట్రాక్టర్లకు ఎలా కేటాయిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్‌కళ్యాణ్ ఉండి ఏం సాధించారని ప్రశ్నించారు. ఉపాధి పనులు జరిగిన ప్రదేశాల్లో ఏర్పాటు చేయాల్సిన నేమ్‌బోర్టుల బిల్లుల్లో జరిగిన అక్రమాలపై
సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ వినోద్‌కుమార్‌కు వినతిపత్రం అందించారు. నేమ్‌బోర్డుల నిధులు తమ బందువుల వ్యక్తిగత ఖాతాలకు మళ్లించుకున్న వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడతామన్నారు. కార్యక్రమంలో రాయదుర్గం మండల కన్వీనర్ రామాంజినేయులు, స్థానిక నాయకుడు శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కూలీలకు కాకుండా కాంట్రాక్టర్‌తో పనులు ఎలా చేయిస్తారు?
Comments
Please login to add a commentAdd a comment