అనంతపురం అగ్రికల్చర్: కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) క్వింటా రూ.7,550 ప్రకారం కందుల కొనుగోళ్ల కార్యక్రమం ఈ నెల 15న ముగుస్తుందని మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ పెన్నేశ్వరి తెలిపారు. ఈ మేకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకూ 7,900 మంది రైతుల నుంచి 10,687 మెట్రిక్ టన్నుల కందులు కొనుగోలు చేయగా, ఇందులో 6,886 మంది రైతులకు రూ.59 కోట్ల మేర చెల్లింపులు చేశామన్నారు.


