నీటి సరఫరాలో సమస్యలౖపై నేడు కలెక్టర్ ‘ఫోన్‌ఇన్’
అనంతపురం అర్బన్: పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మంచి నీటి సరఫరాలో సమస్యలను ప్రజల నుంచి నేరుగా తెలుసుకునేందుకు కలెక్టర్ వి.వినోద్ కుమార్ గురువారం ఆకాశవాణి కేంద్రం నుంచి ‘అనంత మిత్ర ఫోన్‌ఇన్’ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 7.45 నుంచి 8.15 గంటల వరకు కలెక్టర్ ఫిర్యాదులు స్వీకరిస్తారు. ప్రజలు 08554–225533, 296890 నంబర్లకు ఫోన్ చేసి తాగునీటి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లవచ్చు.
100 శాతం సబ్సిడీతో డ్రిప్
రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద ఎస్సీ, ఎస్టీలు, చిన్న, సన్నకారు రైతులకు 100 శాతం సబ్సిడీతో బిందు సేద్యానికి ప్రోత్సాహం అందిస్తామని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ అన్నారు. కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో వ్యవసాయ ప్రాథమిక రంగ అనుబంధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఐదెకరాల విస్తీర్ణానికి సబ్సిడీ మొత్తం రూ.2.18 లక్షలుగా ఉంటుందని, ఐదు నుంచి 10 ఎకరాలు ఉన్న రైతు (ఎస్సీ, ఎస్టీలతో సహా) 90 శాతం సబ్సిడీ, పెద్ద రైతులకు (12.5 ఎకరాలు) 50 శాతం సబ్సిడీతో డ్రిప్ అందిస్తామన్నారు.
తపాలా ఎస్పీపై
ఉన్నతాధికారుల సీరియస్
● తక్షణం రిలీవ్ కావాలని ఆదేశం
● కడప ఎస్పీ రాజేష్‌కు ఇన్‌చార్జ్‌గా అదనపు బాధ్యతలు
అనంతపురం సిటీ: అనంతపురం తపాలా శాఖ సూపరింటెండెంట్ (ఎస్పీ) బి.గుంపస్వామిపై ఆ శాఖ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. తెలంగాణ సర్కిల్‌లోని ఆదిలాబాద్ డివిజన్‌కు ఆయన్ను బదిలీ చేస్తూ గతంలో ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన రిలీవ్ కాకుండా అనంతపురంలోనే కొనసాగాలని నిర్ణయించుకుని, బదిలీ రద్దు కోరుతూ ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ విన్నపాన్ని ఉన్నతాధికారులు పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో బదిలీ రద్దు కోసం ఉన్నతాధికారులపై ఒత్తిళ్లు పెంచారు. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు ఈ నెల 9వ తేదీలోపు విధుల నుంచి తప్పనిసరిగా రిలీవ్ కావాలని ఉత్తర్వులు జారీ చేశారు. లేకపోతే ఈ నెల 16 నుంచి జీతం నిలిపివేస్తామని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే కడప తపాలా ఎస్పీగా పనిచేస్తున్న రాజేష్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ నెల 16న అనంతపురం డివిజన్ ఎస్పీగా అదనపు బాధ్యతలను రాజేష్ స్వీకరించనున్నట్లు సమాచారం.
హనుమద్
వాహనంపై శ్రీవారు
తాడిపత్రి: మండలంలోని ఆలూరు కోనలో వెలసిన శ్రీరంగనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు బుధవారం హనుమద్ వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీరంగనాథుడు ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ఆలయంలోని మూలవిరాట్‌కు విశేష పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరి శాయి. రాత్రి హనుమద్ వాహన సేవలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.
నీటి సరఫరాలో సమస్యలౖపై నేడు కలెక్టర్ ‘ఫోన్‌ఇన్’


