కూలీల సంఖ్య పెంచాలి
బొమ్మనహాళ్: ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్య పెంచాలని డ్వామా పీడీ సలీంబాషా సూచించారు. మండలంలోని నేమకల్లు, లింగదహాళ్, కొలగానహళ్లి గ్రామాల్లో ఉపాధి హామీ కింద జరుగుతున్న సీసీ రోడ్లు, గోకులంషెడ్లు, అవని ఫ్లాంటేషన్ పండ్ల మొక్కల పెంపకం, పశువుల తొట్టె నిర్మాణ పనులను ఆయన గురువారం పరిశీలించారు. పీడీ మాట్లాడుతూ నేమకల్లులో సీసీ రోడ్ల పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. పనుల్లో నాణ్యత ఉండాలని ఆదేశించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ సిబ్బందితో సమావేశం నిర్వహించి పనులకు వచ్చే కూలీల సంఖ్య పెంచాలని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ నాగేశ్వరరావు, ఎంపీడీఓ విజయభాస్కర్, పీఆర్ రాజ్ జేఈఈ జగదీష్, ఏపీఓ భాగ్యలక్ష్మి, టెక్నికల్ అసిస్టెంట్లు బ్రహ్మయ్య, నాగేంద్ర పాల్గొన్నారు.
పిడుగుపాటుకు
గొర్రెలు, మేకల మృతి
గార్లదిన్నె: పెనకచెర్ల గ్రామంలో గురువారం సాయంత్రం పిడుగుపడి గొర్రెలు, మేకలు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు.. గ్రామానికి చెందిన రైతు చితంబరప్ప తమ గొర్రెలు, మేకలను పొలాల్లో మేపుకొని ఇంటికి వస్తుండగా మార్గమధ్యలో గాలీవాన, ఉరుములు, మెరుపులు అధికమయ్యాయి. దీంతో వాటిని సమీపంలోని సుంకులమ్మ గుడి వద్ద చెట్టు కిందకు వదిలాడు. చితంబరప్ప గుడి వద్ద నిల్చున్నాడు. అదే సమయంలో చెట్టుపై పిడుగు పడడంతో 8 గొర్రెలు, 2 మేకలు మృతి చెందాయి. దాదాపు రూ.1.50 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు వాపోయాడు.
కూలీల సంఖ్య పెంచాలి


