కట్టడి చేసేందుకు ప్రత్యేక బృందాలు
నిషేధిత పొగాకు ఉత్పత్తుల గురించి సమాచారం వచ్చిన వెంటనే దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నాం. ప్రత్యక్షంగా.. పరోక్షంగా గుట్కా అక్రమ వ్యాపారానికి సంబంధం ఉన్న వారిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. గుట్కా వ్యాపారుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాం. ఇప్పటివరకు గుట్కా విక్రయిస్తూ పట్టుబడిన వారందరిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపించాం. గుట్కా విక్రయాలపై పోలీసులతో ప్రజలు సహకరించాలి. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం.
– వి.రత్న, శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ


