వైభవంగా సీతారామాంజనేయ విగ్రహ ప్రతిష్ట
బుక్కరాయసముద్రం: మండలంలోని రోటరీపురంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట్ర కార్యక్రమం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. గ్రామంలో 3 రోజుల పాటు ఆగమ శాస్త్ర సంప్రదాయాలతో పూజలు జరిగాయి. ఆలయ నిర్మాణానికి మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, వైఎస్సార్ సీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం కో–ఆర్డినేటర్ ఆలూరి సాంబశివారెడ్డి రూ.30 లక్షల విరాళం ఇచ్చారు. శుక్రవారం ఆలయంలో మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఆలూరి సాంబశివారెడ్డి, ఆలూరి రమణారెడ్డి ప్రత్యేక పూజల అనంతరం నేత్రపర్వంగా సీతారాముల కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మాట్లాడుతూ రోటరీపురంలో ఎంతో సుందరంగా సీతారామాలయం రూపుదిద్దుకోవడం అభినందనీయమన్నారు. గ్రామంలో శనివారం రథోత్సవం నిర్వహించన్నట్లు తెలిపారు.
వైభవంగా సీతారామాంజనేయ విగ్రహ ప్రతిష్ట


