వైఎస్సార్‌సీపీ నాయకులపై ‘పచ్చ’పాతం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నాయకులపై ‘పచ్చ’పాతం

Sep 28 2025 7:17 AM | Updated on Sep 28 2025 7:17 AM

వైఎస్సార్‌సీపీ నాయకులపై ‘పచ్చ’పాతం

వైఎస్సార్‌సీపీ నాయకులపై ‘పచ్చ’పాతం

డిజిటల్‌ రేషన్‌ కార్డులు పంపిణీ చేయని వైనం

యాడికి: అధికార పార్టీ నాయకులు, డీలర్లు వైఎస్సార్‌సీపీ నాయకులపై ‘పచ్చ’పాతం చూపుతున్నారు. డిజిటల్‌ రేషన్‌ కార్డులు అందించకుండా వేధిస్తున్నారు. దీనిపై బాధితులు సచివాలయ సిబ్బందిని ఆశ్రయించినా ఫలితం లేక పోయింది. వివరాలు.. యాడికి మండలంలోని వెంగన్నపల్లిలో ఇటీవల ప్రభుత్వం అందజేసిన స్మార్ట్‌ రేషన్‌ కార్డులను డీలర్లు ఇంటింటికీ పంపిణీ చేపట్టారు. అయితే గ్రామంలో దాదాపు 30 మంది వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులకు మాత్రం కార్డులు అందించకుండా వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ విషయంపై పలు మార్లు బాధితులు స్థానిక సచివాలయం వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసినా ఏ మాత్రమూ పట్టించుకోలేదు. దీంతో శనివారం మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో బాధితులు అధికారులకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో వెంగన్నపల్లి ఎంపీటీసీ పుట్లూరు జయప్రద, పుట్లూరు సరస్వతి, పుట్లూరు ఉమాదేవి, పుట్లూరు చిన్న వెంకట రెడ్డి, నంద్యాల రాములమ్మ, గుత్తి పంపిరెడ్డి, లక్ష్మిరంగా రెడ్డి, రమేష్‌ రెడ్డి, శివశంకర్‌ రెడ్డి, సూరి, నరసింహులు, తిరుమలేశ్వర రెడ్డి, ప్రసాద్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారంలో సర్కారు విఫలం

సచివాలయ ఉద్యోగుల మండిపాటు

అనంతపురం మెడికల్‌: రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల న్యాయపరమైన సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని సచివాలయ ఉద్యోగుల జేఏసీ నాయకులు మండిపడ్డారు. శనివారం నగరంలోని టవర్‌క్లాక్‌ వద్ద ఉన్న మహాత్మా గాంధీ, జెడ్పీ వద్ద ఉన్న అంబేడ్కర్‌ విగ్రహాలకు వారు వినతి పత్రాలు అందించి, ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఉద్యోగులకు న్యాయబద్ధంగా రావాల్సిన 3 నెలల నోషనల్‌ ఇంక్రిమెంట్లు, 9 నెలల అరియర్స్‌, పదోన్నతులు, మాతృశాఖ ప్రకారం జాబ్‌చార్ట్‌, ఆరేళ్లు పూర్తయిన ఉద్యోగికి ఆటోమేటిక్‌ అడ్వాన్స్‌ స్కీం మంజూరు తదితర డిమాండ్లను నెరవేర్చాలన్నారు. ముఖ్యంగా సచివాలయ ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందిగా ఉన్న డోర్‌ టూ డోర్‌ సర్వేలకు స్వస్తి చెప్పాలన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు సుధాకర్‌, మల్లికార్జున, చంద్ర, వరప్రసాద్‌, లక్ష్మినారాయణ, హనుమంతు, ముత్యాలు, మంజునాథ్‌, మృదుల, శంకర్‌ రెడ్డి, విద్యాసాగర్‌, నరేష్‌, చిన్నవన్నూరప్ప, కిషోర్‌, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.

గాండ్లపర్తిలో అదృశ్యం.. బళ్లారిలో ప్రత్యక్ష్యం

రాప్తాడు: గాండ్లపర్తిలో అదృశ్యమైన తల్లీపిల్లలు బళ్లారిలో ప్రత్యక్ష్యమయ్యారు. వివరాలు.. మండలంలోని గాండ్లపర్తి గ్రామానికి చెందిన సాకే పోతులయ్య భార్య పద్మలత తన మూడేళ్ల కుమార్తె భానుశ్రీ, 8 నెలల కుమార్తె బేబీతో కలిసి ఈ నెల 23న అదృశ్యమైంది. దీనిపై పోతులయ్య ఫిర్యాదు మేరకు సీఐ టీవీ శ్రీహర్ష కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి అనంతపురంలోని ఆర్టీసీ బస్టాండ్‌, రైల్వే స్టేషన్లలో గాలించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ఆలయాల దగ్గర గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. ఈ క్రమంలోనే బళ్లారిలో తల్లీకుమార్తెల ఆచూకీ లభ్యం కావడంతో వెళ్లి తీసుకొచ్చారు. శనివారం వారిని తహసీల్దార్‌ ఎదుట ప్రవేశపెట్టిన అనంతరం భర్త సాకే పోతులయ్యకు అప్పగించారు. పోలీసులను అనంతపురం రూరల్‌ డీఎస్పీ వెంకటేశులు ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement