
సాక్షి, అమరావతి : గడిచిన 24 గంటల్లో 67,419 కరోనా వైరస్ శాంపిల్స్‌ను పరీక్షించగా.. 2,997 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,07,023కు చేరుకుంది. కరోనా నుంచి కొత్తగా 3,585 మంది కోలుకోగా.. ఇప్పటివరకు డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 7,69,576గా ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 21 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 6587కు చేరింది. ఏపీలో ప్రస్తుతం 30,860 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 75,70,352ల శాంపిళ్లు పరీక్షించినట్లు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment