సాక్షి, విశాఖపట్నం: ప్రధాని నరేంద్రమోదీ విశాఖ పర్యటనకు సంబంధించి దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల నుంచి 2లక్షల మంది.. మిగతా నాలుగు జిల్లాల నుంచి లక్ష మంది దాకా ప్రజలు హాజరవుతారని చెప్పారు. సభకు వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ స్వాగతం పలుకుతారన్నారు. రూ.15,000 కోట్లతో అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారన్నారు. ఇది రాజకీయ సభ కాదు.. అభివృద్ధికి సంబంధించిన సభ మాత్రమేనని తెలిపారు.
'నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడ చెట్లు తొలగించలేదు. ప్రధాని సభకు అడ్డువచ్చిన కొన్ని చెట్లను మాత్రమే తొలగించారు. మళ్లీ అదే స్థాయిలో మొక్కలను నాటుతారు. 30 ఎకరాల స్థలంలో మీటింగ్ జరుగుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రేవేటీకరణకు మేము వ్యతిరేకం. స్టీల్ ప్లాంట్ అనేది కేంద్ర పరిధిలో అంశం. ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశాము. రూ.15 వేల కోట్ల అభివృద్ధి పనులు తక్కువ అంటున్న చంద్రబాబు, ఆయన దోచుకున్న రూ.5లక్షల కోట్లతో పోలిస్తే ఇవి చాలా తక్కువేనని' ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment