YSSRCP MLA Ambati Rambabu Angry Over SEC Ramesh Kumar - Sakshi
Sakshi News home page

ఎస్‌ఈసీ నిమ్మగడ్డపై అంబటి రాంబాబు ఆగ్రహం

Published Sat, Jan 30 2021 4:48 PM | Last Updated on Sat, Jan 30 2021 7:40 PM

Ambati Rambabu Slams Nimmagadda Over His Kadapa Tour Comments - Sakshi

సాక్షి, అమరావతి : టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఎజెండాలో భాగంగానే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ జిల్లాల పర్యటన జరుగుతోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు  అన్నారు. తనకు పదవి ఇచ్చిన చంద్రబాబు రుణం తీర్చుకోవాలని నిమ్మగడ్డ భావిస్తున్నారన్నారు. శనివారం అంబటి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ టీడీపీని చిత్తుగా ఓడించారని వైఎస్సార్‌సీపీపై నిమ్మగడ్డ కక్ష సాధిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉంటున్నాయి. జిల్లాల పర్యటనల్లో నిమ్మగడ్డ రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారు. ( అన్నయ్య వస్తాడని మోసపోకుమా..! )

దివంగత నేత వైఎస్సార్‌ అంటే తనకు అభిమానమని నిమ్మగడ్డ అంటున్నారు.. 2009లో ఆయన మరణిస్తే 2021లో నిమ్మగడ్డకు అభిమానం పుట్టుకొచ్చింది. వైఎస్సార్‌ విగ్రహాలకు ముసుగు వేయిస్తావ్‌.. పొగుడుతావ్‌. కడప ఎన్నికల రివ్యూకు వెళ్లి సీబీఐ కేసుల గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నారు?. పెన్ను, కాగితం ఉందని లేఖలు రాస్తున్నారు.. మీడియాకు లీక్ చేస్తున్నారు’’ అంటూ మండిపడ్డారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement