అనకాపల్లి, సాక్షి: వసతి గృహంలో ఫుడ్‌పాయిజన్.. నలుగురు చిన్నారుల్ని బలిగొంది. మరో 27 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలు కాగా.. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కోటవురట్ల మండలం కైలాసపట్నంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
కైలాసపట్నంలోని ఓ ఆశ్రమంలో 60 మంది విద్యార్థులు.. ఓ ఆర్గనైజేషన్ ద్వారా ఉచిత వసతితో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. ఎం. కిరణ్ కుమార్ అనే వ్యక్తి దీనిని నిర్వహిస్తున్నారు. అయితే.. ఆదివారం మధ్యాహ్నాం వసతి గృహంలో పిల్లలు సమోసా తిన్నారు. వాటితో ఫుడ్ పాయిజన్ కావడంతో పిల్లలు వాంతులు చేసుకున్నారు. దీంతో ఆందోళన చెందిన నిర్వాహకులు.. పిల్లలను వారి వారి స్వస్థలాలకు పంపించి వేశారు.
వీళ్లలో చింతపల్లి మండలానికి చెందిన ఇద్దరు పిల్లలు.. వాళ్ల ఇళ్ల వద్ద మృతి చెందారు. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో మరో ఏడుగురు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై డిప్యూటీ డిఈఓ పెన్నాడ అప్పారావు, ఎంఈఓ పి రామారావు, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment