
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని హైస్కూళ్లు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతాయని పాఠశాల విద్యా శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు ఉత్తర్వులు జారీ చేశారు. హైస్కూళ్లలో ఉదయం 8 నుంచి 8.45 గంటల వరకు విద్యార్థులకు సెల్ఫ్ లెర్నింగ్, సూపర్వైజరీ స్టడీ, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు గేమ్స్, స్పోర్ట్స్ ఉంటాయి.
వీటికి ఆయా స్కూళ్ల ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లు, ఎస్‌ఏ (పీడీ)లు తప్పని సరిగా హాజరు కావాలి. ఈ సమయాల్లో ఇతర టీచర్ల హాజరు ఆప్షన్ మాత్రమే. ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 2.30 వరకు స్కూల్ సమయాల్లో హాజరు మినహాయింపు ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment