Andhra Pradesh: Property Registration Charges Paid Through Union Bank Of India - Sakshi
Sakshi News home page

యూనియన్‌ బ్యాంకులో ఆస్తుల రిజిస్ట్రేషన్‌ ఫీజులు

Published Sat, Jun 10 2023 9:06 AM | Last Updated on Sat, Jun 10 2023 2:28 PM

Andhra Pradesh: Property Registration Fees Paid Through Union Bank Of India - Sakshi

సాక్షి, అమరావతి: ఆస్తుల రిజిస్ట్రేషన్‌ ఫీజులు, అన్ని రకాల యూజర్‌ చార్జీలను ఇకపై యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ)లోనూ చెల్లించొచ్చు. అన్ని రకాల స్టాంప్‌ పేపర్లు కూడా ఈ బ్యాంకు శాఖల్లో లభిస్తాయి. ఇప్పటివరకు ఈ సేవలు ఎస్‌బీఐ ట్రెజరీ బ్యాంకుల్లోనే ఉన్నాయి. శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూబీఐ శాఖల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. బ్యాంకులో ఇచ్చే ఈ స్టాంప్‌ పేపర్‌ ఆధారంగా రాష్ట్రంలో అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన అన్ని రకాల లావాదేవీలను నిర్వహించుకోవచ్చు.

ఈ మేరకు స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌తో యూ­బీఐ శుక్రవారం అవగాహన ఒప్పందం చేసు­కుంది. స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ రీజనల్‌ మేనేజర్‌ సత్యేంద్రకుమార్‌ తివారీ, యూబీఐ స్టేట్‌ ఫీల్డ్‌ జనరల్‌ మేనేజర్‌ నవనీత్‌ కుమార్‌ల మధ్య విజయవాడలో ఈ ఒప్పందం జరిగింది. ఈ కార్యక్రమంలో యూబీఐ ఉన్నతాధికారులు మురళీపార్థసారథి, శారదామూర్తి, పీవీజేఎన్‌ మూర్తి పాల్గొన్నారు. రాష్ట్రంలోని 120 యూబీఐ బ్రాంచ్‌లలో శనివారం నుంచి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని యూబీఐ ఎఫ్‌జీఎం నవనీత్‌ కుమార్‌ వివరించారు.

చదవండి: Fact Check: వాస్తవాలకు మసిపూసి ‘ఈనాడు’ విష ప్రచారం
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement