
మహారాణిపేట (విశాఖ): బంగ్లాదేశ్ పరిసరాల్లో ఉపరితల అవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో శుక్రవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ నిపుణులు తెలిపారు. ఇది 15న పశ్చిమ బెంగాల్‌కు ఆనుకుని బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతుందని వెల్లడించారు. దీని ప్రభావం ఏపీపై ఉండబోదని స్పష్టం చేశారు.
ఏపీలో పెరిగిన ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. వాతావరణంలో వేడి ఎక్కువవుతోంది. గురువారం అనేక ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. కావలిలో 38.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ కేంద్రం తెలిపింది.మరో వారం ఇదే పరిస్థితి ఉంటుందని నిపుణులు తెలిపారు.