సాక్షి, అమరావతి: గృహనిర్మాణ ప్రాజెక్టుల్లో పేదలు కొనుగోలుచేసే అవకాశం ఉండేలా 45, 60 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఇళ్లు నిర్మిస్తే.. ఆ ప్రాజెక్టుకు చెల్లించాల్సిన పన్నుల్లో పదిశాతం రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇలా ఇళ్లు నిర్మిస్తే సంబంధిత గృహ నిర్మాణ ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చిన దానికంటే మరో అంతస్తు అదనంగా నిర్మించుకునే వెసులుబాటు కల్పించనుంది. ఈ మేరకు ఏపీ బిల్డింగ్ రూల్స్–2017ను సవరిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీచేశారు.
చదవండి: (అది డైవర్ట్ చేయడానికే చిలక, గోరింక రుషికొండ వెళ్లాయి: మంత్రి అమర్నాథ్)
Comments
Please login to add a commentAdd a comment