
సాక్షి, అమరావతి: నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు తీరుపై ఏపీ సీఐడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. రఘురామ తమకు చెప్పినదానికి, ఢిల్లీ పోలీసుల ఫిర్యాదుకు తేడా ఉందని.. దర్యాప్తు సంస్థలను పక్కదారి పట్టించేలా ఆయన వ్యవహరిస్తున్నారని సీఐడీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా.. ‘‘మొబైల్ ఫోన్ అంశంలో రఘురామ తప్పుదారి పట్టిస్తున్నారు. మే 15న రఘురామ మొబైల్ (యాపిల్ 11) స్వాధీనం చేసుకున్నాం. అందులో ఉన్నది ఫలానా నెంబర్ అని రఘురామ చెప్పారు. ఇద్దరు సాక్షుల ముందు రఘురామ స్టేట్‌మెంట్ నమోదు చేశాం. మొబైల్ ఫోన్ సీజ్ చేసిన అంశాన్ని సీఐడీ కోర్టుకు తెలిపాం. రఘురామ యాపిల్ ఫోన్‌ను విశ్లేషించేందుకు ఫోరెన్సిక్‌కు పంపించాం. రఘురామ ఫోన్ డాటాను మే 31న కోర్టుకు అందించాం’’ అని సీఐడీ తెలిపింది.
‘‘తన ఫోన్ సీజ్ చేసినట్టు ఢిల్లీ పోలీసులకు.. రఘురామ ఫిర్యాదు చేసినట్టు మీడియాలో గమనించాం. తన నెంబర్ అంటూ అని ఢిల్లీ పోలీసులకు వేరే ఫోన్ నంబర్ ఇచ్చారు. రఘురామ మే 15న మాకు చెప్పినదానికి, ఢిల్లీ పోలీసుల ఫిర్యాదుకు తేడా ఉంది. దర్యాప్తు సంస్థలను పక్కదారి పట్టించేలా రఘురామ ఫిర్యాదు ఉందని’’ సీఐడీ అభ్యంతరం వ్యక్తం చేసింది.
చదవండి: అది కేసును ప్రభావితం చేసే కుట్రే
Comments
Please login to add a commentAdd a comment