ఈసారికి క్షమించండి.. వచ్చేసారి కలుస్తా: సీఎం జగన్‌ | AP CM YS Jagan Asks Forgive Only Once For Not Being Able To Meet Corporators | Sakshi
Sakshi News home page

ఈసారికి క్షమించండి.. వచ్చేసారి కలుస్తా: సీఎం జగన్‌

Published Fri, Jul 9 2021 7:37 PM | Last Updated on Fri, Jul 9 2021 8:25 PM

AP CM YS Jagan Asks Forgive Only Once For Not Being Able To Meet Corporators - Sakshi

సాక్షి, వైఎస్సార్‌జిల్లా: ‘కార్పోరేటర్‌లు అందర్నీ కలవలేకపోతున్నామని చెప్పి మన డిప్యూటీ సీఎం అంజద్‌ భాషా చెబుతా ఉన్నారు.  నెక్స్ట్‌ టైమ్‌ అందర్నీ కల్పించే కార్యక్రమం​ చేయమని అంజద్‌ భాయ్‌కి చెబుతున్నా. అందర్నీ కూడా వచ్చే పర్యటనలో కల్పించమని చెబుతున్నా. వారికి టైమ్‌ ఇచ్చి కల్పించే కార్యక్రమం చేయమని అంజద్‌కు, సురేశ్‌కు చెబుతున్నా.  నా తదుపరి పర్యటనలో కార్పోరేటర్లను అందర్నీ కలిసి వారితో ముచ్చటిస్తా. ఈసారి మిమ్ముల్ని కలవలేకపోతున్నందుకు డిప్యూటీ సీఎంను, నన్ను క్షమించండి’  అని సీఎం జగన్‌ కడప మహవీర్‌ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన సభాముఖంగా పేర్కొన్నారు.  

అంతకుముందు మహవీర్‌ సర్కిల్‌లో రహదారి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఆరు, నాలుగు లైన్ల రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీపీ బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. డా.వైఎస్సార్‌ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి పనులు వేగంగా జరుగుతున్నాయని, డా.వైఎస్సార్‌ క్యాన్సర్‌ కేర్‌ సెంటర్‌కు టెండర్లు పూర్తయ్యాయని వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement