
దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్సార్ సంక్షేమ కార్యక్రమాలపై తనదైన ముద్ర వేసి ఇప్పటికే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయనకు క్రీడలు అంటే మక్కువ ఎక్కువ. గతంలో ఎల్బీ స్టేడియానికి వెళ్లినప్పుడు క్రికెట్ బ్యాట్ చేతపట్టి షాట్లు కొడుతూ తనలో తాను మురిసిపోయారు. ఒకవైపు క్రికెట్ కామెంటరీ చెబుతుంటే మరొకవైపు వైఎస్సార్ షాట్లతో అభిమానుల్ని అలరించారు.
కాగా, ప్రజా సంక్షేమంలో తండ్రి వైఎస్సార్ బాటనే అనుసరిస్తున్న ఆయన తనయుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్.. క్రికెట్ బ్యాట్‌తో అలరించడం ఇప్పుడు వైరల్‌గా మారింది. సీఎం వైఎస్ జగన్ తాజా కడప పర్యటనలో భాగంగా వైఎస్ రాజారెడ్డి ఏసీఏ క్రికెట్ స్టేడియం అభివృద్ధి పనులకు శుక్రవారం శ్రీకారం చుట్టారు. ఫ్లడ్ లైటింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. దీనిలో భాగంగా సీఎం జగన్ క్రికెట్ బ్యాట్ పట్టారు. క్రికెట్ ఆడి అలరించారు. అప్పుడు వైఎస్సార్, ఇప్పుడు సీఎం జగన్‌లు క్రికెట్ ఆడటంతో ‘నాడు తండ్రి-నేడు తనయుడు’ అనుకుంటూ అభిమానులు మురిసిపోతున్నారు.