వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్ష.. సీఎం జగన్‌ కీలక ఆదేశాలు | AP CM YS Jagan Review On Health Department August 2022 | Sakshi
Sakshi News home page

వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్ష.. సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

Published Wed, Aug 17 2022 1:08 PM | Last Updated on Wed, Aug 17 2022 6:46 PM

AP CM YS Jagan Review On Health Department August 2022 - Sakshi

సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆరోగ్యశ్రీ విధానంపై సీఎం సమీక్షించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు.
చదవండి: కేసీఆర్‌ చేసింది పెద్ద రిస్కే.. ఇది ఆషామాషీ విషయం కాదు 

గణనీయంగా చికిత్సా విధానాలను పెంచుతున్నట్లు సీఎం జగన్‌ ప్రకటించారు. కొత్తగా ఆరోగ్యశ్రీ పరిధిలోకి 754 ప్రొసీజర్లను అనుమతించారు. మొత్తంగా ఆరోగ్యశ్రీ కింద 3,118 చికిత్సా విధానాలు వచ్చాయి. ఇకపై కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లుగా మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్లు వ్యవహరించనున్నారు.

వైద్య ఆరోగ్య శాఖలో మరికొన్ని కీలక సంస్కరణలకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ఉండే ప్రభుత్వ ఆస్పత్రులు, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలు, విలేజ్‌ క్లినిక్స్‌ అన్నీకూడా సంబంధిత జిల్లాలోని మెడికల్‌కాలేజీ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించారు. మెడికల్‌ కాలేజీ పరిధిలోకి వైద్య, పరిపాలనా కార్యకలాపాలు రానున్నాయి. పకడ్బందీగా వైద్య సేవలు అందడానికి, సిబ్బంది మధ్య సమన్వయానికే ఈ చర్యలు అని, ఎవరి బాధ్యతలు ఏంటి? విధి విధానాలు ఏంటన్నదానిపై ఎస్‌ఓపీని తయారుచేయాలని సీఎం ఆదేశించారు. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని ఇకపై కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లుగా మిడ్‌లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్లు వ్యవహరిస్తారని సీఎం అన్నారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఏమన్నారంటే..:
గణనీయంగా ఆరోగ్యశ్రీ చికిత్సా విధానాలు పెంచుతూ నిర్ణయం
కొత్తగా ఆరోగ్య శ్రీ పరిధిలోకి రానున్న 754  ప్రొసీజర్లు
మొత్తంగా ఆరోగ్య శ్రీ కింద అందుబాటులోకి రానున్న  3118 చికిత్సా విధానాలు
సెప్టెంబరు 5 నాటికి అందుబాటులోకి రానున్న కొత్త చికిత్సా విధానాలు

సమర్ధవంతంగా ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌
ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను సమర్థవంతంగా అమలు చేయాలన్న సీఎం
దీనికోసం మూడు అంశాలపై దృష్టిపెట్టాలన్న సీఎం
విలేజ్‌ క్లినిక్, పీహెచ్‌సీల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి
దీనితర్వాత పూర్తిస్థాయిలో సిబ్బందిని అందుబాటులో ఉంచాలి
అవసరమైన అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచాలి
ఒక ప్రత్యేక అధికారిని నియమించుకుని ఈ పనులు ఎలా ముందుకు సాగుతున్నాయన్నదానిపై ప్రతిరోజూ సమీక్ష, పరిశీలన చేయాలని సీఎం ఆదేశం

ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌కు అవసరమైన కసరత్తు పూర్తిచేస్తున్నామన్న అధికారులు
పీహెచ్‌సీలు – ఎంఎంయూలు (104) మ్యాపింగ్‌ పూర్తైందన్న అధికారులు
అలాగే పీహెచ్‌సీలు – సచివాలయాలు మ్యాపింగ్‌ పూర్తిచేస్తామన్న అధికారులు
ఇప్పటికే 656 ఎంఎంయూ 104లు పనిచేస్తున్నాయన్న అధికారులు
మరో 432 ఎంఎంయూ 104 వాహనాలను సమకూరుస్తున్నామన్న అధికారులు

వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లపైనా సమీక్ష
ప్రతి విలేజ్‌క్లినిక్‌లో మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్, ఒక ఏఎన్‌ఎం, ఒకరు లేదా ఇద్దరు ఆశావర్కర్లు ఉంటారు
అంటే ప్రతి విలేజ్‌ క్లినిక్‌లో 3 నుంచి 4 గురు సిబ్బంది ఉంటారు
మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్లను ఇకపై కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌గా పిలవాలని సీఎం ఆదేశం
విలేజ్‌ క్లినిక్స్‌లో 67 రకాల మందులు అందుబాటులో ఉంటాయి
14 రకాల పరీక్షలు కూడా అందుబాటులో ఉంటాయి

6956 టెలీమెడిసన్‌ స్పోక్స్, 27 హబ్స్‌ ఏర్పాటు
మెడికల్‌ హబ్స్‌ను అన్ని జిల్లాల వైద్యకళాశాలల్లో ఏర్పాటు చేయాలి
జిల్లా వైద్య కళాశాల నేతృత్వంలోనే ఇవి పనిచేయాలి :
ఈ మెడికల్‌ హబ్స్‌ నుంచి చికిత్సలకు అవసరమైన సలహాలు, సూచనలు వైద్యులకు వెళ్లాలి

బూస్టర్‌ డోస్‌ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న సీఎం
18 ఏళ్లు పైబడ్డ వారందరికీ బూస్టర్‌ డోసు వేయాలి
పార్వతీపురం జిల్లాలోనూ వైద్యకళాశాలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశం
ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం

వైద్య ఆరోగ్యశాఖలో కీలక సంస్కరణలు 
వైద్య ఆరోగ్యశాఖలో మరికొన్ని కీలక సంస్కరణలకు సీఎం ఆదేశం
జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించిన కార్యకలాపాలు అన్నీ అదే జిల్లాకు చెందిన వైద్యకళాశాల నేతృత్వంలో జరగాలి
డీఎంఅండ్‌ హెచ్‌ఓ కార్యకలాపాలుకూడా జిల్లా మెడికల్‌కాలేజీలోనే ఉండాలి
డీఎంఅండ్‌హెచ్‌ఓ మరియు డీసీహెచ్‌ఎస్‌లను జిల్లా మెడికల్‌ కాలేజీ పరిధిలోకి తీసుకురావాలన్న సీఎం
మొత్తంలో జిల్లాలో ఉండే అన్నిరకాల ఆస్పత్రులు, క్లినిక్స్‌కు సంబంధించిన వైద్య సంబంధిత కార్యకలాపాలు, పరిపాలనా కార్యకలాపాలు అన్నీ కూడా
మెడికల్‌కాలేజీ నేతృత్వంలోనే ఉండాలన్న సీఎం
ఎవరు ఏంచేయాలి? ఎవరి విధులు ఏంటి? ఎవరి బాధ్యతలు ఏంటి? అన్నదానిపై పకడ్బందీగా ఎస్‌ఓపీ తయారుచేయాలి: అధికారులకు సీఎం ఆదేశం

ఈ సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, సీఎస్‌ సమీర్‌ శర్మ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌ జె నివాస్, ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జీ ఎస్‌ నవీన్‌ కుమార్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి మురళీధర్‌రెడ్డి, ఏపీ వైద్య విధానపరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి వినోద్‌ కుమార్, వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ (డ్రగ్స్‌)  రవిశంకర్, డాక్టర్‌ వైయస్సార్‌ ఏహెచ్‌సీటీ అడిషనల్‌ సీఈఓ ఎంఎన్‌ హరీంద్రప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement