
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపు(మంగళవారం) ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం బయలుదేరి సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ చేరుకోనున్నారు. అనంతరం రాత్రి 9 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఇదిలా ఉండగా, సీఎం వైఎస్ జగన్ సోమవారం పోలవరంలో పర్యటించారు. తొలుత ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టును శరవేగంగా సాకారం చేసి రాష్ట్ర ప్రజలకు ఫలాలను అందచేసే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న సీఎం.. పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించి గడువులోగా పూర్తి చేసేలా అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు అధికారులతో సమీక్ష నిర్వహించారు.
(చదవండి: తప్పుడు ప్రచారాలపై సీఎం జగన్ ఆగ్రహం)
(చదవండి: 18న కేబినెట్ సమావేశం)
Comments
Please login to add a commentAdd a comment