అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ మార్చ్‌లో హోంమంత్రి అనిత
బీచ్ రోడ్డు(విశాఖ తూర్పు)/భవానీపురం(విజయవాడ పశ్చిమ): మాదక ద్రవ్యాల రహిత ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా వంద రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నామని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం బీచ్ రోడ్డులో కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఏ వరకు పోలీసులు మార్చ్ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన అనిత తొలుత మార్చ్‌లో పాల్గొన్న వెయ్యి మందితో మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు.
అనంతరం జెండా ఊపి అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ విశాఖను డ్రగ్స్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు యువత సహకారం అవసరమని చెప్పారు. విద్యార్థి దశ నుంచే డ్రగ్స్ దుష్పరిణామాలపై అవగాహన కల్పించాలని సూచించారు. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎ.రవిశంకర్ మాట్లాడుతూ గంజాయి, ఇతర డ్రగ్స్‌ను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
మాదకద్రవ్యాల వినియోగంతో యువశక్తి ని ర్వీర్యం
దేశాభివృద్ధిలో యువశక్తి కీలక పాత్ర పోషిస్తుందని, అయితే మాదకద్రవ్యాల వినియోగం వలన ఆ యువశక్తిలో కొంత నిర్వీర్యం కావడం బాధాకరమని రాష్ట్ర డీజీపీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. డ్రగ్స్ వాడకం విద్యార్థులకు ఒక ఫ్యాషన్‌గా మారుతుందని, అది వారి జీవితాన్ని కబళించి వేస్తుందని గ్రహించలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
డ్రగ్స్ విక్రయాలు, వాడకాన్ని నిర్మూలించేందుకు వంద రోజుల ప్రణాళిక రెడీ అవుతుందని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ పీహెచ్‌డీ రామకృష్ణ తెలిపారు. వివిధ శాఖల అధికారుల సమన్వయంతో డ్రగ్స్ టాస్‌్కఫోర్స్‌ను ఏర్పాటు చేయనున్నామని వివరించారు. అడిషనల్ డైరెక్టర్ ప్రాసిక్యూషన్ బైరా రామకోటేశ్వరరావు, ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి ప్రసంగించారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు కృషి చేస్తామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
Comments
Please login to add a commentAdd a comment